Bathukamma Special : ఇది మగవాళ్ల బతుకమ్మ.. ఈ ఒక్క ఊరిలోనే ఇలా..!

Bathukamma Special : ఇది మగవాళ్ల బతుకమ్మ.. ఈ ఒక్క ఊరిలోనే ఇలా..!

మగవాళ్ల బతుకమ్మ ఏంటి? వింతగా ఉంది? అని ఆశ్యర్యపోతున్నారా? అవును ఈ ఊళ్లలో మగవాళ్లు కూడా బతుకమ్మ ఆడతారు. ఇక్కడ ఆడ, మగా అంతా కలిసి బతుకమ్మ ఆడతారు.

బతుకమ్మ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పూలు, ఆడవాళ్లే. కానీ.. ఇక్కడి వాళ్లకు కాస్త వెరైటీగా మగవాళ్ల సంబురాలు గుర్తొస్తాయి. కారణం.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని తోటపల్లి, గొల్లపల్లి గ్రామాల్లో ప్రతి సంవత్సరం మగవాళ్లు కూడా బతుకమ్మ ఆడతారు. ఆడవాళ్లతో కలిసి పాటలు కూడా పాడతారు. కాకపోతే ప్రతి రోజూ కాదు. 

ALSO READ | Bathukamma Special: బతుకమ్మ ఎప్పుడు, ఎక్కడ పుట్టింది.. జరిగిన పరిశోధనలు ఏంటీ..?

మొదటి రోజు (ఎంగిలి పూల), చివరి రోజు (సద్దుల) రోజు మాత్రమే. ఆడవాళ్లతోపాటు మగవాళ్లు కూడా చెరువు కట్ట దగ్గరకు వెళ్తారు. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో తెలియదు కానీ.. మగవాళ్లు మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు మగవాళ్లు ఆడే బతుకమ్మ ఆట చూడ్డానికి ఇక్కడికి చుట్టు పక్కల ఊళ్ల నుంచి కూడా చాలామంది వస్తారు.

–వెలుగు, లైఫ్​–