చదలవాడ హేమేశ్​కు బాల పురస్కార్

కంగ్రాట్స్ చెప్పిన రాష్ట్రపతి,
నేడు మోడీ ఇంటరాక్షన్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు చెందిన చదలవాడ హేమేశ్‌కు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2021 అవార్డు దక్కింది. రిపబ్లిక్ డే వేడుకల్ని పురస్కరించుకొని ఏటా కేంద్రం ఈ అవార్డులను ఇస్తోంది. ఇన్నోవేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ రంగాలతో పాటు అసాధారణమైన సామర్ధ్యాలు, సామాజిక సేవ, ధైర్యాన్ని ప్రదర్శిస్తోన్న పిల్లలను ఈ అవార్డులకు ఎంపిక చేస్తోంది. ఈసారి 21 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీల నుంచి 32 మంది బాలలను ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆదివారం ప్రకటించింది. ఇన్నోవేషన్ కేటగిరీలో తెలంగాణ నుంచి హేమేశ్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన 14 ఏండ్ల హేమేశ్ చిన్న వయసులోనే ప్రోగ్రామ్ డెవలపర్‌‌గా పేరు తెచ్చుకున్నాడు. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్, ఎంఎల్ ఇంజనీర్,  వివిధ ఇన్నోవేషన్స్‌‌‌‌తో ఇన్నోవేటర్‌‌గా గుర్తింపు పొందాడు. వివిధ ఎంటర్‌‌‌‌ప్రెన్యూర్‌‌‌‌షిప్ పోటీలలో కూడా పాల్గొన్నాడు.  బాల పురస్కార్ అవార్డుకు ఎంపికైనవారికి రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కంగ్రాట్స్ చెప్పారు. అవార్డు గ్రహీతలతో  ప్రధాని మోడీ సోమవారం వర్చువల్‌‌గా ఇంటరాక్ట్ కానున్నారు.

ఇవి కూడా చదవండి..

ఆరున్నరేళ్లుగా పెద్దసార్లను మార్చట్లె!

ప్రాణహిత ప్రవాహం తగ్గింది.. యాసంగికి నీళ్లెట్ల..?

పీహెచ్‌‌‌‌సీ నుంచే పెద్ద డాక్టర్‌‌‌‌కు చూపెట్టుకోవచ్చు