బంధాల భావోద్వేగాలకు నిలయం..బలగం. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇంటి పెద్ద చనిపోయిన రోజు నుంచి..11వ రోజు వరకు ఓ కుటుంబంలో జరిగే పరిణామాలే కథగా తెరకెక్కిన బలగం..ప్రతీ ప్రేక్షకున్ని మెప్పించింది. అందుకే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.
కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన తొలి సినిమా..మార్చి 3న విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. బలగం మూవీ సూపర్ హిట్ కావడంతో డైరెక్టర్ వేణు యెల్డంది కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. కుటుంబంతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో షేర్ చేశాడు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బలగం సినిమా మొదలు పెట్టాను....అంజన్న దయతో బలగం మీ అందరిని మెప్పించింది...అంజన్న దర్శనం అద్భుతంగా జరిగింది..’అని వేణు ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.
https://twitter.com/VenuYeldandi9/status/1640937179903057920
స్వచ్ఛమైన ..అచ్చమైన పల్లె కథ బలగం. చిన్ననాటి ఆటలు..యాసలోని మాటలు.. కుటుంబంలో ఎన్ని కష్టాలు, బాధలున్నా..వారి పట్ల ఉండే మమకారాన్ని కళ్లకు కట్టినట్లు దర్శకుడు వేణు అద్భుతంగా తెరకెక్కించారు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్తో పాటు..ప్రతీ పాత్రకు నటీనటులు వందశాతం ప్రాణం పోశారు. బలగం సినిమాకు పాత్రలు ఒక ఎత్తు అయితే.. భీమ్స్ సంగీతం..సినిమాను మరో లెవల్కు తీసుకెళ్లిందని చెప్పొచ్చు.