టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో.. వెంకటేష్తో బలగం దర్శకుడు

బలగం(Balagam) సినిమాతో అనూహ్యమైన విజయాన్ని దక్కించుకున్నారు జబర్దస్త్ కమెడియన్ వేణు(Comedian Venu). మానవ బంధాలు, అనుబంధాలు, కుటుంబ విలువలు వంటి ఎమోషనల్ కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమా చూస్తూ తమ కుటుంబాన్ని తలుచుకొని చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతలా ఈ సినిమాతో ఆడియన్స్ మనసులను కదిలించాడు దర్శకుడు వేణు. సినిమా చూశాక వేణులో ఇంత విషయం ఉందా అని అనుకున్నారు చాలా మంది.

ALSO READ: కాంగ్రెస్‌‌లో చేరిన మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్

దీంతో వేణు చేయబోయే తరువాతి సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా ఈ దర్శకుడి తరువాతి సినిమా ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారు. అయితే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు వేణు తన తరువాతి సినిమాను విక్టరీ వెంకటేష్ తో చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియదు కానీ.. ఈ కాంబో మాత్రం ప్రస్తుతం ట్రేండింగ్ గా మారింది. నెటిజన్స్ కూడా ఈ కాంబోలో సినిమా రావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇప్పటికే రూమర్ లాగే ఉన్న ఈ కాంబోలో సినిమా నిజంగా వస్తుందా అనేది తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

ఇక వెంకటేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు శైలేష్ కొలనుతో సైంధవ్ అనే సినిమా చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా 2024 జనవరి 13 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో.. శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా, రుహాణి శర్మ, తమిళ నటుడు ఆర్య, బాలీవుడ్ నటుడు నావాజుద్దిన్ సిద్ధికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.