Daaku Maharaaj: బాలయ్య డాకు మహారాజ్ కు గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్..

Daaku Maharaaj: బాలయ్య డాకు మహారాజ్ కు గుమ్మడికాయ కొట్టేసిన చిత్ర యూనిట్..

బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి రూపొందిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ మంగళవారంతో  పూర్తయిందని ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ..  ‘సంక్రాంతికి థియేటర్స్‌‌‌‌లో భారీ తుఫాన్ రాబోతోంది’ అంటూ సినిమాపై అంచనాలు పెంచారు. 

ఇప్పటికే విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్, టీజర్ ఆసక్తిని పెంచాయి.   బాలయ్య కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 109వ చిత్రం. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.   సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.