
హైదరాబాద్, వెలుగు: నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు మూడు పతకాలు గెలిచారు. పారా ప్లేయర్లు ముదావత్ బాలాజీ బంగారు పతకం నెగ్గగా, కాలేరు సాయి ప్రభాత్ రజతం సాధించాడు. అండర్– 21 విభాగం 67 కేజీల కుమిటేలో జనిత్ రాజూరి కాంస్య పతకం గెలిచాడు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం ముగిసిన మెగా ఈవెంట్‌లో ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా ఆయా విభాగాల్లో ఓవరాల్ చాంపియన్లుగా నిలిచాయి.
తెలంగాణ కరాటే అసోసియేషన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ విన్నర్లకు ట్రోఫీలు, మెడల్స్ అందజేశారు. 2027 ఆసియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు హైదరాబాద్ లోనే నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రానున్న రోజుల్లో మరిన్ని క్రీడా పోటీలకు తెలంగాణ వేదిక కాబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, కరాటే ఇండియా అధ్యక్షులు భారత్ శర్మ, నిర్వాహకులు కీర్తన్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.