బీఆర్ఎస్​ ఓటమే లక్షంగా పని చేయాలి: బాలకిష్టారెడ్డి

బీఆర్ఎస్​ ఓటమే లక్షంగా పని చేయాలి: బాలకిష్టారెడ్డి

మక్తల్,  వెలుగు: బీఆర్ఎస్​ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి ఓటమే లక్షంగా కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని బీకేఆర్​​ఫౌండేషన్​ అధినేత బాలకిష్టారెడ్డి కోరారు. శుక్రవారం పట్టణంలోని ఓ ఫంక్షన్​హాల్​లో కాంగ్రెస్​ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కాంగ్రెస్  పార్టీకి శ్రీహరి 30 ఏండ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి హైకమాండ్​ టికెట్ కేటాయించిందన్నారు. అందరం అండగా నిలిచి నియోజకవర్గంలో కాంగ్రెస్  పార్టీ జెండా ఎగరేసి బహుమతిగా ఇద్దామన్నారు. 18 ఏండ్లుగా మక్తల్​ నియోజకవర్గం  ఎలాంటి అభివృద్ది  సాధించలేదన్నారు.

ఇక్కడి ఎమ్మెల్యే ఇసుక, నల్ల మట్టి దందాలు,సెటిల్మెంట్​లు చేసి రూ.100 కోట్లతో హైదరాబాద్​లో ఇల్లు కట్టుకున్నాడని ఆరోపించారు. తాను బాగుడ్డాడే కాని నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ది  చేయలేదన్నారు. కేంద్ర నిధులతో  హైవే, రైల్వేలైన్​ వస్తే  తానే  చేసినట్లు చెప్పుకుంటున్నాడని విమర్శించారు. వాకిటి శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని డెవలప్​ చేయడంతో పాటు కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. మాన్వి రామారావు, గోపాల్​ రెడ్డి, లక్ష్మారెడ్డి,  రవికుమార్​యాదవ్, గడ్డంపల్లి హన్మంతు, కోళ్ల వెంకటేశ్, గణేశ్​కుమార్, గంగాధర్ గౌడ్, విష్ణువర్ధన్​రెడ్డి, తాయప్ప పాల్గొన్నారు.