నేను డాకు మహారాజ్ ని.. చరిత్ర సృష్టించాలన్నా నేనే.. దాన్ని తిరగరాయాలన్నా నేనే.: బాలకృష్ణ

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా జనవరి 12న గ్రాండ్ గ వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇందులోభాగంగా హీరో బాలయ్య బాబు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

గత ఏడాది నుంచి ఇప్పటివరకూ నటించిన 2 సినిమాలు వరుస హిట్ అయ్యాయని అలాగే డాకు మహారాజ్ సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ఈ సినిమా మొదటి టీజర్, ట్రైలర్ పెద్దగా ఆసక్తికరంగా లేవని కానీ ఈరోజు వదిలిన రిలీజ్ ట్రైలర్ మాత్రం కచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక అప్పట్లో 1986లో తాను నటించిన సినిమాలు వరుసగా 7 హిట్ అయ్యాయని అంతేకాకుండా ఇందులో 6 సినిమాలు సిల్వర్ జూబ్లీ ఆడగా, మరో సినిమా 100 డేస్ ఆడిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. 

Also Read :- హీరోయిన్ ని వేధించిన కేసులో బిజినెస్ మెన్ కి నో బెయిల్..

ఇక నా ధైర్యం, నే పొగరు నేనే అంటూ ధీమా వ్యక్తం చేశారు. నేను ఎవరి కీర్తిని తలపై మోయనని నా కీర్తిని కిరీటంగా అలంకరించుకుని తలపై మోస్తానని డాకు మహారాజ్ సినిమాలోని డైలాగ్ చెప్పాడు. అఖండ సినిమా తర్వాత సినిమాల పరంగా గేర్ మార్చానని నా సెకెండ్ ఇన్నింగ్స్ లో నట విశ్వరూపం చూపిస్తానని "లెట్స్ వెయిట్ అండ్ వాచ్" అని తెలిపాడు. అలాగే నేను డాకు మహారాజ్ ని..  చరిత్ర సృష్టించాలన్న నేనే.. దాన్ని తిరగరాయాలన్నా నేనే అంటూ డైలాగ్ చెబుతూ అదరగొట్టాడు. ఇక ఊర్వశి రౌటేలా గురించి స్పందిస్తూ ఈ సినిమాలో ఉర్వశి డ్యాన్స్ మాత్రమే కాదు మంచి పాత్రా చేసిందని కచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుందని తెలిపాడు.