మోక్షజ్ఞ సినిమా వాయిదా... అంతా మనమంచికే అంటున్న బాలకృష్ణ..

మోక్షజ్ఞ సినిమా వాయిదా... అంతా మనమంచికే అంటున్న బాలకృష్ణ..

టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు యంగ్ హీరో నందమూరి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతన్నాడు. ఇప్పటికే స్టోరీ నేరేషన్, ఫస్ట్ లుక్ రిలీ చెయ్యడం ఇవన్నీ పూర్తయిపోయాయి. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. 

అయితే మోక్షజ్ఞ లాంచ్ ప్రాజెక్ట్ కి అంత సిద్ధంగా ఉండటంతో డిసెంబర్ 05న పూజా క్రకార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఈ పూజ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ కూడా వస్తున్నట్లు ప్రకటించారు. కానీ అనుకోకుండా లాస్ట్ మినిట్ లో ఈ పూజా సెర్మనీ క్యాన్సిల్ అని చెప్పడంతో నందమూరి అభిమానులు నిరాశకి గురయ్యారు. 

దీంతో హీరో బాలకృష్ణ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇందులోభాగంగా మోక్షజ్ఞ కి గత రెండుమూడు రోజులనుంచి జ్వరంతో బాధ పడుతున్నాడని అందుకే పూజ కార్యక్రమాలు క్యాన్సిల్ చేశామని తెలిపాడు. అలాగే వాతావరణం కారణంగా జ్వరం అధికమైందని అందుకే చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నాడు. ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది త్వరలోనే తెలియజేస్తామని చెబుతూ ఏది జరిగినా మనమంచికే అనుకొవాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.  ఈ పూజా కార్యక్రమాల ఏర్పాట్లపై దాదాపుగా రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

ఈ విషయం ఇలా ఉండగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే 3 సినిమా ఆఫర్లు దక్కించుకున్నాడు. ఇందులో మొదటగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆ తర్వాత ఇటీవలే లక్కీ భాస్కర్ తో హిట్ అందుకున్న ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించే సినిమాలో నటిస్తున్నాడు. 

అప్పట్లో బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 సినిమా సీక్వెల్ లో హీరోగా నటిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. ఈ సినిమాకి ఆదిత్య 999 అనే టైటిల్ ని పరిశిలిస్తుండగా బాలకృష్ణ కథని అందించడంతోపాటూ దర్శకత్వం వహిస్తున్నాడు