Akhanda 2 movie update: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

Akhanda 2 movie update: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... అఖండ 2 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా 14రీల్స్ బ్యానర్ పై నారా బ్రాహ్మణి, తేజస్విని కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే 2021 లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్ గా బోయపాటి శ్రీను ఈ సినిమాని తెరకేకిస్తున్నాడు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైన్ మెంట్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అతేగాకుండా వరల్డ్ వైడ్ గా దాదాపుగా రూ.130 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది.  దీంతో అఖండ 2 పై కూడా భరే అంచనాలు నెలకొన్నాయి. 

అయితే ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని అఖండ 2 షూటింగ్ ప్రారంభమైంది. దీంతో ఈ అఖండ 2 సినిమాని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ విషయానికి సంబందించిన పోస్టర్లు, టైటిల్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఈ నేల ఆసురుడికాదు, ఈశ్వరుడిది అనే చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇక పోస్టర్ లో రక్తంతో తడిసిన త్రిశూలం పట్టుకున్న చేయి కనిపించింది. దీంతో బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరోసారి బాలయ్య అఖండ తాండవం చూపించడానికి రెడీ అవుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా బాలకృష్ణ, ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి డైరెక్షన్ లో వస్తున్న "డాకు మహారాజ్" సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తీ చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.