Akhanda 2 Thandavam : అఖండ2 కోసం జార్జియాలో రెక్కీ చేస్తున్నా డైరెక్టర్ బోయపాటి

Akhanda 2 Thandavam : అఖండ2 కోసం జార్జియాలో  రెక్కీ చేస్తున్నా డైరెక్టర్ బోయపాటి

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న  క్రేజీ ప్రాజెక్ట్ ‘అఖండ2 : తాండవం’. నాలుగేళ్ల తర్వాత ‘అఖండ’కు సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతోన్న చిత్రమిది.  ఇప్పటికే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,  కుంభమేళా, హిమాలయాల్లో కొంత టాకీ పార్ట్‌‌‌‌‌‌‌‌ను పూర్తి చేశారు.  ఈ చిత్రం నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ జార్జియాలో జరగనుంది.  ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను అక్కడ అద్భుతమైన ప్రదేశాల కోసం రెక్కీ చేస్తున్నాడు.  బాలకృష్ణతో సహా  ఇతర నటీనటులంతా పాల్గొననున్న ఈ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో  కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.  జార్జియా సీనరిక్ బ్యూటీ నేపథ్యంలో ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌‌‌‌‌‌‌‌గా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. 

 జార్జియాలో జరుగుతున్న రెక్కీల మధ్య శుక్రవారం బోయపాటి శ్రీను తన పుట్టినరోజును జరుపుకున్నారు.   సంయుక్త మీనన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.  తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి  కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతోన్న  నాలుగో చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.  దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా మూవీగా దీన్ని విడుదల చేయబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.