Akhanda2 Title Video: థియేటర్లో అఖండ తాండవమే.. పూనకాలు తెప్పిస్తోన్న టైటిల్ వీడియో

Akhanda2 Title Video: థియేటర్లో అఖండ తాండవమే.. పూనకాలు తెప్పిస్తోన్న టైటిల్ వీడియో

నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అఖండ(Akhanda) ఒకటి. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించడంతో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

బోయపాటి – బాలయ్య కాంబోలో మూడో సినిమాగా వచ్చిన అఖండ.. హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ 'అఖండ 2- తాండవం' ఇవాళ అక్టోబర్ 16న అనౌన్స్ చేశారు మేకర్స్. 

బాలకృష్ణ, బోయపాటి నాలుగో మూవీ (BB 4) టైటిల్ రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. హిమాలయాల బ్యాక్‌డ్రాప్లో ఓ ఆధ్యాత్మిక ఫీల్ కలిగేలా పోస్టర్ వీడియో డిజైన్.. శివలింగం, డమరుకంలాంటి వాటిని కూడా చూపించి  స్పిరిచువల్ ఫీలింగ్ కలిగేలా చేశారు మేకర్స్.

Also Read : మ్యూజిక్తో ఫిదా అయ్యేలా.. జెర్సీ డైరెక్టర్, అనిరుధ్ల మ్యాజిక్ అప్డేట్

ఈ వీడియోలో బాలయ్య నుదుటికి విభూతి రాసుకుంటూ ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకున్నారు. అంతేకాకుండా 'తాండవం' అనే ట్యాగ్ పెట్టి బాలయ్య మార్క్ మాస్ జాతర ఉంటుందనే చెప్పేసారు. ఇక తమన్ బీజీఎం టైటిల్ రివీల్ వీడియోకు హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో చూసి బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీన్ని బట్టి ఇక థియేటర్లో తాండవం.. అఖండ తాండవం మొదలైనట్టే అనిపిస్తోంది.

  • Beta
Beta feature