బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: ఆ క్రేజీ డైరెక్టర్ తో నాలుగోసారి

బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: ఆ క్రేజీ డైరెక్టర్ తో నాలుగోసారి

టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే గతంలో బాలకృష్ణతో డాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తీసిన సింహా, లెజెండ్, అఖండ తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. దీంతో మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే దసరా పండగ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో భాగంగా ఆడియన్స్ కి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్టోబర్ 16న ఉదయం 10.00 గంటలకి ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే ది మాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అంటూ పోస్టర్ ని కూడా షేర్ చేశారు. దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Also Read:-నవీన్ చంద్ర హీరోగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్

ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహా రెడ్డి చిత్రం మంచి హిట్ అయ్యింది. కానీ బోయపాటి శ్రీను ఈ ఏడాది డైరెక్ట్ చేసిన స్కంద చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది. దీంతో బోయపాటి బాలకృష్ణ చిత్రంతో హిట్ కొట్టాలని స్క్రిప్ట్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు.