మళ్ళీ చేతికి పని చెప్పిన బాలకృష్ణ.. సెల్ఫీ అడిగితే చెల్లుమనిపించాడు

సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన చేతికి పని చెప్పారు. గతంలో పలుమార్లు అభిమానులపై చేయి చేసుకున్న బాలయ్య తాజాగా హిందూపురంలో ప్రచారం చేస్తుండగా అభిమాని చెంప చెల్లుమనిపించాడు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో బస్సు యాత్ర ద్వారా కదిరి నుండి ప్రచారాన్ని ప్రారంభించిన బాలకృష్ణ సెల్ఫీ కోసం వచ్చిన అభిమానిపై చేయి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

కదిరిలో బాలకృష్ణ ప్రచారం చేస్తున్న సమయంలో అభిమానులు ఒక్కసారిగా గుంపుగా వచ్చి సెల్ఫీ కోసం ఎగబడ్డారు. దీంతో ఆగ్రహించిన బాలకృష్ణ వారిపై చేయి చేసుకున్నాడు. అభిమానులపై చేయి చేసుకోవటం బాలకృష్ణకు ఇది కొత్తేమీ కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఫ్యాన్స్ చెంపలు చెల్లుమనిపించాడు. అయినప్పటికీ ఫ్యాన్స్ లో బాలయ్య మీద అభిమానం ఏమాత్రం తగ్గలేదు.కాగా, గతంలో రెండుసార్లు హిందూపురం నుండి పోటీ చేసి గెలిచిన బాలకృష్ణ, ఈసారి ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నాడు.