బాలయ్య బాక్సాఫీస్ దండయాత్ర.. 200 కోట్ల దిశగా భగవంత్ కేసరి

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా.. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ చేసిన ఈ సినిమా.. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.  దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

లేటెస్ట్ గా భగవంత్ కేసరి సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో రూ.106.2Cr (గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో..ఈ వీకెండ్ కూడా బాక్సాపీస్ రికార్డ్ లు క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు ట్రేడ్ వర్గాలు. 

భగవంత్ కేసరి వరుస కలెక్షన్స్ చూసుకుంటే..

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక రెండవ రోజు రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో..కేవలం రెండు రోజుల్లోనే రూ.51.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో హాఫ్ సెంచరీ దాటేసింది. ఇక మూడో రోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 72 cr గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి..ఇలా రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటు పొతుంది. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వంద కోట్లకు పైగా బాక్సాఫీస్ రికార్డ్స్ ను కొల్లగొట్టిన బాలయ్య..వరుసగా మూడోసారి ఆ ఫీట్ ను సాధించనున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఈ సినిమా గురించి అందరూ సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన బలమని..ఇవే విజయానికి కారణమని కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఓ తండ్రికి బిడ్డకు మధ్య ఉండాల్సిన అందమైన భావోద్వేగానికి అందరూ కనెక్ట్‌ అవుతున్నారు. ఆడపిల్లను సింహంలా పెంచాలనే మంచి సందేశం జనాల్లోకి తొందరగా వెళ్లింది.

ALSO READ: పాత పద్దతిలో మెగా156 మొదలు.. అప్డేట్ ఇచ్చిన మెగాస్టార్ అండ్ టీమ్
 

ఇక ఈ వారం కూడా దసరా సెలవులు ఉండటం భగవంత్ కేసరి కి కలిసి వచ్చే అంశం..ఈ సినిమాతో పాటు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు , లియో సినిమాలకి బ్యాడ్ టాక్ రావడంతో ఫ్యామీలి అడియాన్స్కి మెదటి చాయిస్గా బాలయ్య సినిమానే కనిపిస్తుంది. ఈ టాక్ ఇలానే  కొనసాగితే.. వికెండ్ లోపు 200 కోట్లు రావడం పెద్ద  విషయం కాదు.