నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా.. దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్స్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
బాలకృష్ణను గత చిత్రాల మాదిరిగా కాకుండా.. చాలా కొత్తగా ప్రెజెంట్ చేశారు అనిల్ రావిపూడి రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా.. ఎమోషన్స్, మెసేజ్ తో ప్రేక్షకులని మెప్పించింది ఈ సినిమా. దీంతో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక రెండవ రోజు రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. కేవలం రెండు రోజుల్లోనే హాఫ్ సెంచరీ దాటేసి రూ .51.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
Also Read :- శ్రీలీల షాకింగ్ రెమ్యునరేషన్.. కాజల్ కన్నా ఎక్కువ
ఇక రానున్న రెండు, మూడు రోజులు కూడా వీకెండ్, పండగ సెలవులు కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి.. భగవంత్ కేసరి సినిమాతో మరో వంద కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకోనున్నారు బాలయ్య. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వంద కోట్ల కొల్లగొట్టిన బాలయ్య.. వరుసగా మూడోసారి ఆ ఫీట్ ను సాదించనున్నాడు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.