భగవంత్ కేసరి మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది! స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే?

బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) దసరా కానుకగా థియేటర్లో రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది. యువత నుంచి, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి టాక్ తో దూసుకెళ్లిన భగవంత్ కేసరి..ఓటీటీ రిలీజ్ కు సిద్ధమయ్యింది.

ఈ మూవీ నవంబర్ 23 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ పై..మేకర్స్ నుంచి ఎటువంటి ఆఫీసియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. అయితే, త్వరలో మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.

భగవంత్ కేసరి మూవీలో..ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఓ తండ్రికి బిడ్డకు మధ్య ఉండాల్సిన అందమైన భావోద్వేగానికి అందరూ కనెక్ట్‌ అయ్యారు. ఆడపిల్లను సింహంలా పెంచాలనే మంచి సందేశం జనాల్లోకి తొందరగా వెళ్లడంతో సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఎమోషనల్ సీన్స్, బాలకృష్ణ మాస్ అప్పీరెన్స్, డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని అలరించాయి. 

బాల‌య్య‌కు జోడిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ (Kajal Aggarwal) నటించగా శ్రీలీల (Sreeleela) బాలయ్య కి కూతురి పాత్ర‌లో నటించి మెప్పించింది. అక్టోబర్ 19 న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ  రూ.130కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన్నట్లు మేకర్స్ తెలిపారు.