
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ అండ్ బ్లాక్ బస్టర్ కాంబో అంటే బాలయ్య(Balakrishna), బోయపాటి(Boyapati)దే అని చెప్పాలి. ఈ మాసీ కాంబోలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. ఆ మూడు కూడా ఒకదాని మించి ఒకటి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇక కాంబోలో ఫైనల్ గా వచ్చిన మూవీ అఖండ. ఈ డివోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అఘోరగా బాలయ్య నటవిశ్వరూపాని చూపించాడు బోయపాటి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇక అప్పటి నుండి బాలయ్య, బోయపాటి కాంబో కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ కాంబోలో అఖండ 2 రానుంది అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే.. అభిమానుల ఎదురుచూపులు ఎండ్ కార్డు వేస్తూ.. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రానున్న కొత్త సినిమాపై అధికారిక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు సంధర్బంగా BB4 అప్డేట్ ఇస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.
The Lethal Combo that sets the screens on fire is Back ??
— 14 Reels Plus (@14ReelsPlus) June 10, 2024
The two Forces - 'GOD OF MASSES' #NandamuriBalakrishna & #BoyapatiSreenu reunite for #BB4 ??
Happy Birthday Balayya Babu ❤️?
Produced by @RaamAchanta #GopiAchanta under @14ReelsPlus banner ❤️
Presented by… pic.twitter.com/Oj9b1j9bvS
ఈ సినిమాను తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. అయితే ఈ కొత్త సినిమా అఖండ 2 నా లేక కొత్త కథతో రానున్నారా అనేది తెలియాల్సి ఉంది. కానీ, ఈ ఒక్క పోస్టర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇక ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు బాబీ కొల్లితో NBK 109 సినిమా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.