బాలయ్య సినిమాల వరుస అప్డేట్స్.. ప్రోమో, ఫస్ట్ సింగిల్ వచ్చేస్తున్నాయి

బాలయ్య సినిమాల వరుస అప్డేట్స్.. ప్రోమో, ఫస్ట్ సింగిల్ వచ్చేస్తున్నాయి

బాలయ్య నటించే సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. నిన్న డిసెంబర్ 11 న అఖండ రిలీజ్ డేట్ రాగా.. తాజాగా డాకు మహారాజ్(Daaku Maharaaj) అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న డాకు మహారాజ్ నుంచి ప్రోమో అండ్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్స్ వచ్చాయి.

డాకు మహారాజ్ ప్రోమో రేపు శుక్రవారం Dec 13న ఉదయం 10:08 రానుంది. ఫస్ట్ సింగిల్ డిసెంబర్ 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ వెల్లడించలేదు. ఈ లేటెస్ట్ అప్డేట్స్తో బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక రేపు రానున్న డాకు మహారాజ్ ప్రోమో ఏ లెవల్లో ఉండనుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. 

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ 2025 జనవరి 12న థియేటర్స్‌‌‌‌లో రాబోతోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ సాంగ్స్ ఆడియన్స్లో ఆసక్తిని పెంచేశాయి. బాలయ్య కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 109వ చిత్రం. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.