NBK109: డాకు మహారాజ్ పాటల నగరా మొదలు.. బాలయ్య, తమన్ల సెన్సేషన్ బ్లాస్ట్ వచ్చేస్తోంది

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి రూపొందిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ 2025 సంక్రాంతికి థియేటర్స్‌‌‌‌లో రాబోతోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ సాంగ్స్ ఆడియన్స్లో ఆసక్తిని పెంచేశాయి. దీంతో డాకు మహారాజ్ పాటల నగరా మోగించడానికి తమన్ రెడీ అయ్యాడు.

ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. "బ్లాక్‌బస్టర్ ట్రాక్‌తో మ్యూజిక్ చార్ట్‌లలో జోష్ నింపడానికి ఫస్ట్ సింగిల్ సిద్ధమవుతోంది.. తమన్, బాలయ్య కాంబో మరోసారి సెన్సేషన్ బ్లాస్ట్ చేయడానికి కొత్త పూనకాలతో వస్తున్నారు" అని మేకర్స్ ప్రకటించారు.ఈ మేరకు బాలయ్య, తమన్ ల పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే, ఈ పాట ఎప్పుడు రిలీజ్ అనేది వెల్లడించలేదు. ఈ వీక్ ఎండింగ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ

బాలయ్య కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 109వ చిత్రం. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్  హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది.