Daaku Maharaaj Collection: అఫీషియల్.. డాకు మహారాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్.. నెట్, గ్రాస్ ఎన్ని కోట్లంటే?

బాలకృష్ణ డాకు మహారాజ్ (Daaku Maharaaj) మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆదివారం జనవరి 12న రిలీజైన డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రూ.56 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

" డాకు మహారాజ్ మొదటి రోజు రూ.56 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి సంక్రాంతిని సొంతం చేసుకుంది. ఇది బాలయ్య కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్" అంటూ మేకర్స్ వెల్లడించారు. ఇక డాకు మహారాజ్ మూవీ దాదాపు రూ. 22.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

వాటిలో నైజాం నుంచి రూ.4.07 కోట్లు వసూలు చేసింది. సీడెడ్ నుంచి 5.25 కోట్లు రాగా ఏపీలోని ఉత్తరాంధ్రలో 1.92 కోట్లు, గుంటూరులో రూ.4 కోట్లు, కృష్ణలో రూ.1.86 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.1.95 కోట్లు, పశ్చిమ గోదావరిలో 1.75 కోట్లు, నెల్లూరులో రూ.1.51 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లుగా సమాచారం.

Also Read :- ఫలించిన వెంకీ మామ ప్రమోషన్స్

ఆదివారం నాటికి డాకు మహారాజ్ సినిమా మొత్తం 65.92% తెలుగు ఆక్యుపెన్సీని సాధించింది. అలాగే డాకు మహారాజ్ USAలో $1M+ గ్రాస్‌ను దాటి బ్లాక్‌బస్టర్ జోరును కొనసాగిస్తోంది. అమెరికాలో 1 మిలియన్ అంటే దాదాపు రూ.8 కోట్లు రాబట్టింది.

డాకు మహారాజ్ మూవీ మొత్తంగా ఇండియాలో రూ. 80.70 కోట్లు బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అని చెప్పాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.82 కోట్ల షేర్ రాబట్టాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 67కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు టాక్.