టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి తెలుగు ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించగా స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించాడు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించగా, ప్రగ్య జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా తదితరులు హీరోయిన్లుగా నటించారు. దాదాపుగా రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో మేకర్స్ ఈ సినిమాపై హైప్ పెంచేందుకు రిలీజ్ ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
ALSO READ | Fun Bucket Bhargav: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫన్ బకెట్ భార్గవ్ కి 20 ఏళ్ళు జైలు శిక్ష..
మొదటగా కాలుతున్న అడివిలో ఫైట్ యాక్షన్ సీన్స్ తో వాడి ఒంటిమీద 16 కత్తిపోట్లు.. ఒక బుల్లెట్.. అయినా కిందపడకుండా అంతమందిని.... అంటూ షైన్ టామ్ చాకో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఇందులో బాలకృష్ణ ఎంట్రీ వైల్డ్ గా ఉన్నప్పటికీ వెంటనే ట్రైన్ దిగుతూ మళ్ళీ సాఫ్ట్ లుక్ లో కనిపించాడు. ఆ తర్వాత నాకు శత్రువులు తక్కువ.. జాన్ ఇచ్చే ఫ్యాన్స్ ఎక్కువ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఇక బాబీ డియోల్ క్వారీ సన్నివేశాలు.. బాలయ్య ఫ్యామిలీ ఎమోషన్స్ సీన్స్.. చివరిలో ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో నేను చంపడంలో మాస్టర్స్ చేశా అంటూ చెప్పే డైలాగ్ మొత్తం ట్రైలర్ కే హైలెట్ గా నిలిచింది. ఇక తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ గా సింక్ చేశాడు. దీంతో ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఓవరాల్ గా చూస్తే మంచి ఇంట్రెస్టింగ్ జోనర్ లో కట్ చేసిన ట్రైలర్ డాకు మహారాజ్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది చెప్పవచ్చు.