డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్.. కింగ్ ఆఫ్ జంగల్ అంటున్న బాలయ్య..

డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్..  కింగ్ ఆఫ్ జంగల్ అంటున్న బాలయ్య..

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన చిత్రం "డాకు మహారాజ్". ఈ సినిమాలో బాలకృష్ణ కి జంటగా ముగ్గురు హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా నటించారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ విలాన్ గా నటించగా చాందిని చౌదరి, షైన్ టామ్ చాకో, సచిన్ ఖేడేకర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఆదివారం మేకర్స్ డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ ట్రైలర్ విశేషాలేంటో చూసేద్దాం.. 

మొదటగా అనగనగా ఒక రాజు ఉండేవాడు.. చెడ్డవాళ్లంతా ఆయనని డాకు అనేవాళ్ళు.. కానీ మాకు మాత్రం మహారాజు అంటూ చిన్నారి వాయిస్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది... ఇందులో స్టార్టింగ్ లోనే యాక్షన్ సన్నివేశాలతో బాలయ్య పేరు టైటిల్ కార్డుని రివీల్ చేశారు. ఆ తర్వాత సీతారాం, నానాజీ అనే రెండు పాత్రల్లో బాలకృష్ణ కనిపించాడు. 

బాబీ డియోల్ ని చూపించిన సీన్స్ బాగా రిచ్ గా ఉన్నాయి. 2.43 నిమిషాల నిడివిగల ట్రైలర్ లో కేవలామ్ రెండు లేదా మూడు డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. మొత్తం బీజీయంతోనే లాగించేశారు. బాలయ్య సినిమాలకి బీజీయం విషయంలో తమన్ పెట్టింది పేరు. ఈసారి తన మార్క్ చూపించాడు. ఎడిటింగ్, విజువల్ డిజైన్ ఫర్వాలేదనిపించాయి.

Also Read :- చిక్కడపల్లి పీఎస్కు అల్లు అర్జున్

ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించాడు. ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ కాబోతన్న ఈ సినిమా గురించి బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.