Daaku Maharaj Day 2 collections: రెండో రోజు భారీగా పడిపోయిన డాకు మహారాజ్ కలెక్షన్స్...

నందమూరి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా, ప్రగ్యాజైశ్వాల్ జంటగా నటించిన చిత్రం డాకు మహరాజ్. బాబీ. దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీని సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మించారు. రిలీజ్ తర్వాత మంచి పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టింది. 

ఈ క్రమంలో మొదటిరోజు ఈ సినిమా రూ.56 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే రెండు రోజుల్లో రూ.74 కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. వీటినిబట్టి చూస్తే రెండో దాదాపుగా 70% శాతం కలెక్షన్లు డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. దీంతో రెండో రోజు కేవలం రూ.18 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. 

ALSO READ | జైలర్ 2 టీజర్ రిలీజ్: రజినీకాంత్ ఊచకోత.. మూములుగా లేదు అసలు..!

మరోవైపు డాకు మహారాజ్ పై విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎఫెక్ట్ బాగానే పడినట్లు తెలుస్తోంది. మొదటి రెండురోజుల్లో డాకు మహారాజ్ కి థియేటర్స్ లో ఫుల్ ఆక్యుపెన్సీ లభించింది. కానీ "సంక్రాంతికి వస్తున్నాం" 14న రిలీజ్ అవడం, హిట్ టాక్ రావాడటంతో ఈ ఎఫెక్ట్ డాకు మాహారాజ్ పై పడింది. అలాగే ఈ పండగ సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వెంకీ మామ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ వారాంతంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి థియేటర్లు పెంచే అవకాశాలు ఉన్నాయి.