Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అక్కడ సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న డాకు మహారాజ్..

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి తెలుగు ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించగా స్టార్ సినీ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

తెలుగులో డాకు మహారాజ్ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. దీంతో టికెట్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో బాలయ్య తమిళ్, హిందీ ఫ్యాన్స్ కి మేకర్స్ బ్యాడ్ న్యూస్ చెప్పారు.  డాకు మహారాజ్ సినిమాని తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో సంక్రాంతికి బాలయ్య సినిమా చూసి ఎంజాయ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్ నిరాశ ఎదురైందని చెప్పవచ్చు.

ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాతో బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా దాదాపుగా రూ.134 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరితో ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించాడు. ఈ సినిమా కుడా ఫర్వాలేదనిపించడంతో బాలయ్య రెండు సాలిడ్ హిట్లు అందుకున్నాడు. మరి ఈ ఏడాది డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతున్న బాలయ్య ఆడియన్స్ ని  ఎలా అలరిస్తాడో చూడాలి.