టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈరోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం.
కథ: సీతారాం(బాలకృష్ణ) ఇరిగేషన్ ఇంజనీర్ గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ప్రజలకి ఉపయోగపడే ప్రాజెక్టులు చేస్తూ తనపని తాను చేసుకుంటుంటాడు. మైనింగ్ కింగ్ ఠాకూర్ (బాబీ డియోల్) మైనింగ్ చేస్తూ ప్రజలని ఇబ్బంది పెడుతుంటాడు. ఈ క్రమంలో సీతారాం, ఠాకూర్ ఎదురుపడుతారు. దీంతో అనుకోని పరిణామాల వల్ల సీతారాం తన ఉద్యోగానికి రాజీనామా చేసి డాకు మహారాజ్ గా మారి అన్యాయాల్ని ఎదిరిస్తాడు. ఈ క్రమంలో జైలుకి కూడా వెళ్తాడు. ఆ తర్వాత ఎం జరిగింది..? ఎందుకు ఇరిగేషన్ ఇంజనీర్ డాకు మహారాజ్ గా మారాడు.. అనే వివరాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఎప్పటిలాగే బాలయ్య తన అద్భుతమైన నటనతో అలరించాడు. ముఖ్యంగా మాస్ డైలాగ్స్, యాక్టింగ్, ఇలా అన్నీ పెర్ఫెక్ట్ ఫీస్ట్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ లు కూడా తమ ఫెరఫార్మెన్స్ తో మెప్పించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్ కొంతమేర ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి 20 నిమిషాల ముందు వచ్చే సీన్స్ ఫస్టాఫ్ కి హైలెట్ గా నిలిచాయి.
ఇక సెకండాఫ్ విషయానికొస్తే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో ల్యాగ్ ఉన్నపటికీ టేకింగ్ బావుండటంతో ఎక్కడా బోర్ కొట్టదు. యాక్షన్ సన్నివేశాలని కూడా బాబీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాడు. కానీ సాంగ్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది. క్లైమాక్స్ ని ఇంకొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఓవరాల్ సినిమాకి క్లైమాక్స్ సీన్స్ కొంతమేర వీక్ గా ఉంది.
సాంకేతిక నిపుణుల పని తీరు: గతంలో స్టార్ హీరోలతో పని చేసిన అనుభవం ఉండటంతో డైరెక్టర్ బాబీ స్క్రిప్ట్ ని బాగానే హ్యాండిల్ చేశాడని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలయ్య నుంచి ఫ్యాన్స్ ఎక్కువగా కోరుకునేది మాస్ యాక్టింగ్, యాక్షన్ డైలాగ్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఎక్జిక్యూట్ చేశాడు. దీంతో ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో బాబీ సక్సస్ అయ్యాడని చెప్పవచ్చు.
మ్యూజిక్ విషయానికొస్తే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన మార్క్ చూపించాడు. యాక్షన్స్ సీన్స్ కి పర్ఫెక్ట్ బీజీయం సింక్ చేస్తూ ఆడియన్స్ కి పూనకాలు తెప్పించాడు. ఎడిటింగ్ విభాగానికొస్తే ప్రముఖ ఎడిటర్ నిరంజన్ దేవరమని తన ఎక్స్పీరియన్స్ ని చూపించాడు. కానీ సెకెండాఫ్ లోని ల్యాగ్ సన్నివేశాలకి కొన్నిచోట్ల కత్తెర పెట్టాల్సింది. ఇక డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ విషయం గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ సినిమాలోని డ్యాన్స్ గురించి పలు ట్రోల్స్ నడిచాయి. దీంతో థియేటర్స్ లో కూడా డ్యాన్స్ ఫీల్ కలగదు. ఓవరాల్ గా టెక్నీషయన్స్ పనితీరు కూడా ఫర్వాలేదని చెప్పవచ్చు.
తీర్పు: ఎలాంటి అంచనాలు పెట్టుకోకండా సినిమా చూడటానికి వెళితే కచ్చితంగా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. యాక్షన్, ఎంటర్టైన్ మెంట్ సినిమాలు చూసేవారికిమాత్రం ఫుల్ మీల్స్ ఫీస్ట్ అని చెప్పవచ్చు. కానీ లవ్, కామెడీ జోనర్ ని లైక్ చేసేవారు కొత్తగా ట్రై చెయ్యాలంటే ఈ సినిమా మంచి ఆప్షన్.