బాలయ్య కూతురికి స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ ఆఫర్... కానీ ఒప్పుకోలేదట..

బాలయ్య కూతురికి స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ ఆఫర్... కానీ ఒప్పుకోలేదట..

టాలీవుడ్ స్టార్ హారో నందమూరి బాలకృష్ణ సినిమాలకి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. బాలయ్యబాబు కుటుంబం నుంచి నాటివారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే స్క్రిప్ట్, డైరెక్టర్, ప్రొడక్షన్ హౌజ్ ఇలా అన్నీ రెడిగా ఉన్నాయి. అయితే బాలకృష్ణ ఇద్దరి కూతుళ్లు మాత్రం వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. 

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న  "అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే" షోలో నారా బ్రాహ్మణి హీరోయిన్ ఆఫర్ గురించి ఆసక్తికర విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇందులోభాగంగా బ్రాహ్మణికి హీరోయిన్ గా మణిరత్నం సినిమాలో ఆఫర్ వచ్చిందని కానీ ఆమెకి ఆసక్తిలేకపోవడంతో నో చెప్పిందని తెలిపాడు. ఇక రెండో కూతురు తేజస్విని మాత్రం అప్పుడప్పుడూ అద్దం ముందు నిల్చుని యాక్టింగ్ చేస్తుంటుందని చెప్పుకొచ్చాడు. ఇక తనఇద్దరి కూతుళ్లలో ఒక్కరైనా యాక్టర్ అవుతారని అనుకున్నానని కానీ అది కుదరలేదని తెలిపాడు.

ALSO READ | గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం బాలకృష్ణ డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని  రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.