బాలకృష్ణకు సర్జరీ ప్రచారంలో వాస్తవం లేదు

నటసింహం నందమూరి బాలకృష్ణకు సర్జరీపై క్లారిటీ ఇచ్చారు ఆయన ప్రతినిధులు. బాలకృష్ణకు  ఎటువంటి సర్జరీ జరగలేదని.. ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కి వెళ్లారని చెప్పారు. బాలకృష్ణ కాలికి ప్యాడ్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అందరు ఆయనకు సర్జరీ అయ్యిందనుకున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ప్రతినిధులు స్పందించారు. దయ చేసి ఇలాంటి అవాస్తవాలను ప్రచురించవద్దని.. వ్యాప్తి చేయవద్దని కోరారు. ఇవాళ(మంగళవారం)  బాలకృష్ణ సారధి స్టూడియోస్ లో #NBK  107 షూటింగ్ లో పాల్గొన్నారు. 

మళ్లీ మాస్క్ లు తప్పనిసరి చేస్తున్న రాష్ట్రాలు

సీఎం కేసీఆర్ కు ఓటమి భయం