ఈ ఏడాదితో నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు బాలకృష్ణ. ‘తాతమ్మ కల’ సినిమాతో ఆయన కెరీర్ ప్రారంభించారు. ఈ సినిమా విడుదలై ఆగస్టు 30కి యాభై ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 1న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆయనకు ఘన సన్మానం చేయబోతోంది.
ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె.ఎల్.దామోదర ప్రసాద్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, తెలుగు ఫిలిం ఛాంబర్ ట్రెజరర్ టి.ప్రసన్న కుమార్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్.. బాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సినిమా, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.