Daaku Maharaaj Box Office: బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

డాకు మహారాజ్ (Daaku Maharaaj) మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై మంచి బజ్ క్రియేట్ చేసింది. బాలయ్య వన్ మ్యాన్ షో అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఈ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్ తో పాటు అన్నిచోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డాకు మహారాజ్ వసూళ్లు ఎలా ఉన్నాయి? ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది. అనే వివరాలు చూస్తే.. 

ట్రాకింగ్ వెబ్‌సైట్ Sacnilk ప్రకారం:

డాకు మహారాజ్ ఫస్ట్ డే జనవరి 12న ఇండియా వైడ్ గా దాదాపు రూ.22.50 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఆదివారం నాటికి డాకు మహారాజ్ సినిమా మొత్తం 65.92% తెలుగు ఆక్యుపెన్సీని సాధించింది.

Also Read : డాకు మహారాజ్‌ సెలబ్రేషన్స్

యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి సెలవుల్లో అది మరింత పెరుగుతుందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. ఇకపోతే డాకు మహారాజ్ USAలో $1M+ గ్రాస్‌ను దాటి బ్లాక్‌బస్టర్ జోరును కొనసాగిస్తోంది. అమెరికాలో 1 మిలియన్ అంటే దాదాపు రూ.8 కోట్లు రాబట్టింది. అయితే మరి కాసేపట్లో ఫస్ట్ డే జనవరి 12న గ్రాస్ కలెక్షన్స్ లెక్కను మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన డాకు మహారాజ్ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్ కన్నన్ మరియు ఎడిటింగ్: రూబెన్ మరియు నిరంజన్ దేవరమానే. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేల ఫీమేల్ లీడ్స్ గా నటించగా.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు.