- ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలి
భోపాల్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఢిల్లీకి బాలకృష్ణ గురుస్వామి బృందం చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. శనివారం మధ్యప్రదేశ్ దల్ దేవరీలో పాదయాత్రీకులకు ఘన స్వాగతం పలికారు గోరక్షకులు. ఈ సందర్భంగా సాధువులు మాట్లాడుతూ గోవు అన్ని దేవతలకు నిలయమన్నారు. గో హత్య మహాపాపమని వివరించారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేందుకు అన్ని పార్టీల నేతల కృషి చేయాలని కోరారు. గత నవంబర్ 13న హైదరాబాద్ లో గో మహాపాదయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. దాదాపు 1500 కిలో మీటర్లు నడిచి డిసెంబర్ 22న ఢిల్లీ చేరుకోనుంది పాదయాత్ర.