బాలకృష్ణ జోడిగా ఆ హీరోయినా? అవసరమా అంటున్న ఫ్యాన్స్..

వీరసింహ రెడ్డి హిట్ తరువాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)  ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి(Anil Ravipudi ) తో భగవంత్ కేసరి మూవీ చేస్తున్న బాలయ్య.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలయ్య, దర్శకుడు బాబీ(Bobby) తో ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీతీ సింగ్(Rakul Preet Singh) ఎంపికైనట్లు తెలుస్తోంది. 

కథ ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉందని సమాచారం. అందులో ఒక హీరోయిన్ గా రకుల్ ను తీసుకోగా.. మరో హీరోయిన్ గా సంయుక్త మీనన్(Samyuktha Menon)  ను తీసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం  డైరెక్టర్ బాబీ ఊరమాస్ కథని సిద్ధం చేశాడని తెలుస్తోంది. బాలయ్య ఈ కథకి చాలా ఇంప్రెస్  అయ్యినట్లు ఇండస్ట్రీ టాక్. రీసెంట్ గా  ఈ మూవీ  బాలయ్య బర్త్ డే సందర్భంగా గ్రాండ్ గా  స్టార్ట్ చేసిన విషయం తెలిసేందే. 

ALSO READ:మేం ఎవరికి ఏటీం కాదు.. ప్రజల టీం, రైతుల టీం: కేసీఆర్

ఎస్ ఎస్ థమన్(S. S. Thaman) ఈ మూవీకి మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. భారీ బడ్జెట్ తో రానున్న ఈ మూవీని సితార(Sithara)  బ్యానర్‌లో నిర్మాత నాగవంశీ(Naga Vamsi)  నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య(Valteru Veerayya) డైరెక్ట్ చేసిన బాబీ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా నెలకొన్నాయి. మరి మెగాస్టార్(Megastar Chiranjeevi) కి మెగా బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ.. బాలయ్య కు బాక్సాఫిస్ హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.