
టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కి స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కాస్ట్ లీ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇందులో భాగంగా ప్రముఖ ఫోర్ వీలర్ మేకింగ్ సంస్థ పోర్షే కి చెందిన "పోర్షే కయెన్" ఎస్యూవి మోడల్ ని తమన్ కి ఇచ్చాడు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ మేమిద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తమన్ నాకు తమ్ముడితో సమానమని అన్నారు. అలాగే వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తమ్మునికి ప్రేమతో ఇచ్చే బహుమానం ఈ పోర్షే కార్, భవిష్యత్ లోనూ మా జర్నీ ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. అనంతరం కారు తాళాలు అందజేశారు.
ప్రస్తుతం ఈ కార్ ధర మన దేశంలో బేస్ మోడల్ రూ.1.6 నుంచి మొదలై రూ.2.36 కోట్లు మధ్యన ఉంది. 5 సీటర్ కెపాసిటీతో, 2999 సిసి ఇంజన్ ని కలిగి ఉంది. లగ్జరీ ఇంటీరియర్, కంఫర్ట్ సీటింగ్ ఇలా మరెన్నో మంచి ఫీచర్స్ కలిగి ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి పలు ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ALSO READ | రోషన్ కనకాల కొత్త మూవీ మోగ్లీ స్పెషల్ వీడియో
అయితే తమన్ ఇటీవలే బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాకి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంతేకాదు దాదాపుగా రూ.180 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. దీంతో తమన్ టాలెంట్ ని మెచ్చిన బాలకృష్ణ ఏకంగా పోర్షే కార్ గిఫ్ట్ ఇచ్చాడు. తమన్ కి బాలయ్యతో మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఈ క్రమంలో కొందరు బక్కోడికి (తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్) రజినీకాంత్ ఉంటే ఈ బండోడికి బాలయ్య ఉన్నాడంటూ చేసిన కామెంట్స్ ని గుర్తు చేసుకున్నాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమన్ టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ, సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న "తెలుసు కదా", శబ్దం (తమిళ్), ప్రభాస్ నటిస్తున్న "ది రాజాసాబ్" తదితర సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్నాడు.