చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. సీఎం జగన్ పాలకుడు కాదని, కక్షదారుడన్నారు. సీఎం జగన్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పపడుతున్నారని తెలిపారు. చంద్రబాబును 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే జగన్ జీవిత లక్ష్యమని ఆరోపించారు.
ఆధారాలు లేకుండా చంద్రబాబును ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారో చెప్పాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. నిజంగా అవితీని జరిగి ఉంటే ఇంతవరకు ఛార్జిషీట్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఇది కావాలని రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర అని అభిప్రాయపడ్డారు. దీనిపై పార్టీ తరుపున న్యాయపోరాటం చేస్తామని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని బాలకృష్ణ స్పష్టం చేశారు.
Also Read :- చంద్రబాబుకు హైబీపీ..షుగర్
కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏ తప్పూ చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు. అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణమని తెలిపారు. చంద్రబాబుపై పెట్టింది తప్పుడు కేసులేనని చెప్పారు. ఇలాంటి చర్యలను వైసీపీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని పవన్ అన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సింది పోలీసులు కదా?అరాచకాలు జరుగుతున్నది వైసీపీ వల్లే కదా? అని పవన్ మండిపడ్డారు.