ఏపీ తుళ్లూరులో మరో 8 నెలల్లో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తాం: బాలకృష్ణ

ఏపీ తుళ్లూరులో మరో 8 నెలల్లో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తాం: బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నామని ఆస్పత్రి   ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు.   తుళ్లూరులో మరో 8 నెలల్లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారని చెప్పారు. ఫిబ్రవరి 15న బసవతారకం క్యాన్సర్  ఆస్పత్రిలో అంకాలజీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..  పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసియును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

క్యాన్సర్ తో ఎంతో మంది బాధపడుతున్నారని బాలకృష్ణ అన్నారు.  చిన్న పిల్లలకు  ఒంటరి తనం  కలగకుండా 12 పడకలతో ప్రారంభమై 175 పడకలతో  కొనసాగుతుందన్నారు.  200మందికి   పిల్లలకి బోన్  మార్పిడి చేశాం.  రెండు వందల మంది  పిల్లలకు భవిష్యత్తు ఇచ్చాము . ఆర్థిక స్థోమత లేని వారికి ఇక్కడ  వైద్యం అందించడం మా లక్యం. చిన్న పిల్లల  కోసం ఫండ్ రైజింగ్ స్టార్ట్ చేశాం.  ఫండ్ ద్వారా వచ్చిన ప్రతి రూపాయి క్యాన్సర్ వచ్చిన చిన్న పిల్లలకి ఖర్చు చేస్తాము.  చిన్నపిల్లల క్యాన్సర్ పై చేస్తున్న పోరాటంలో భాగంగా బసవతారక  సిబ్బంది ఒక రోజు జీతాన్నీ ఫండ్ గా ఇచ్చారు. హాస్పిటల్ సిబ్బంది సేవలు అభినందనీయం. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉంది.  బసవతారక హాస్పిటల్ కి ఫండ్ ఇస్తున్న దాతలకి ప్రత్యేక ధన్యవాదాలు. నూతన హాస్పిటల్ ని త్వరలోనే  తుళ్లూరులో ప్రారంభించబోతున్నాం అని బాలకృష్ణ అన్నారు.