జర్నలిస్టులకు ఫేస్ బుక్ ద్వారా క్షమాపణ చెప్పిన బాలయ్య.

హిందూపురం నియోజకవర్గంలో బుధ‌వారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బాలకృష్ణ జ‌ర్న‌లిస్టుల‌పై మండిప‌డ్డారు. ఆయ‌న ప్ర‌చారానికి చిన్న పిల్ల‌లు అడ్డుగా వ‌స్తుండ‌డంతో ఆయ‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది ఆ పిల్లలను పక్కకు లాగి ప‌డేశారు. ఈ దృశ్యాల‌ను వీడియో తీసిన రిపోర్ట‌ర్ పై తిట్ల దండ‌కం మొద‌లుపెట్టి, ఆ వీడియోను డిలీట్ చేయాల్సిందిగా బాల‌య్య‌ హెచ్చ‌రించారు.అంతే కాదు “మా బతుకులు మీ చేతుల్లో ఉన్నాయా” అంటూ.. కొన్ని భారీ డైలాగులను కూడా వ‌దిలారు.

ఆ తర్వాత ఈ ఘటనపై ఫేస్‌బుక్‌లో స్పందించిన ఆయ‌న… అక్కడ ఉన్న చిన్నపిల్ల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరి మూకల పని అని భావించి వారిని వారించడం జరిగిందని , అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసిందన్నారు. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని అన్నారు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కుడిగా పోటీ చేయ‌బోతున్న బాల‌య్య న‌టించిన రాజ‌కీయ నేప‌థ్య సినిమా “లెజెండ్” నేటితో 5 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది.