Sreeleela Marriage: టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో బాలకృష్ణ ప్రతీవారం సెలెబ్రెటీలని తీసుకొచ్చి సందడి చేస్తూ ప్రశ్నలు అడుగుతూ ఆటపట్టిస్తూ చేసే అల్లరికి ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. ఐతే ఈసారి బాలకృష్ణ షోకి యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల, ప్రముఖ హీరో నవీన్ పోలిశెట్టి గెస్ట్ గా వచ్చారు. ఈ ఎపిసోడ్ ఇటీవలే ఆహాలో రిలీజ్ అయింది.
అయితే ఈ షోలో బాలకృష్ణ మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమాలో తన కూతురి పాత్రలో శ్రీలీలతో మంచి సన్నహిత సంబంధం ఏర్పడిందని అలాగే శ్రీలీల తన కూతురిలాంటిదని అన్నాడు. ఈ క్రమంలో శ్రీలీలకి మంచి వరుడిని చూసి పెళ్లి చేస్తానని ఈ పెళ్లి బాధ్యతని తానె తీసుకుని అన్నీ దగ్గరుండి చూసుకుంటూ దగ్గరుండి చూసుకుంటూ పెళ్లి చేస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read:-మోహన్ బాబు ఇంటికి ఎందుకు వెళ్లామంటే.. అసలు నిజం బయటపెట్టిన పోలీసులు
ఈ విషయం ఇలా ఉండగా బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహారాజ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తుండగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి తదితరులు ఫిమేల్ లీడ్ పాత్రలు చేస్తున్నారు. కాగా డాకు మహారాజ్ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది.
ఇక నటి శ్రీలీల విషయానికొస్తే ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమాలో కిస్సిక్ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతోంది.