Daaku Maharaaj: బాలయ్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్‌ బిజినెస్.. డాకు మహారాజ్‌ లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Daaku Maharaaj: బాలయ్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్‌ బిజినెస్.. డాకు మహారాజ్‌ లెక్కలు ఎలా ఉన్నాయంటే?

నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj). ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ మూవీ యాక్షన్ డ్రామాగా రూపొందింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అద్దిరిపోయాయి. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఎంతుండే ఛాన్స్ ఉందనే వివరాలు చూద్దాం. 

డాకు మహారాజ్ సినిమా నైజాం, ఏపీలో కలిపి మొత్తం రూ.73కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ జరిగిందని సమాచారం.అందులో నైజాం ఏరియాల్లో రూ.21 కోట్లకు(18కోట్లు అని మరో టాక్‌) అమ్ముడు పోయిందట. ఇక ఏపీలో రూ.51కోట్ల వరకు బిజినెస్ చేసిందని తెలుస్తోంది.

ఇందులో సీడెడ్‌లో రూ.16కోట్లు, ఆంధ్రాలో రూ.35కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు టాక్. ఆంధ్రాలో ఉత్తరాంధ్ర రూ.8.40కోట్లు, ఈస్ట్ గోదావరి రూ.6.30కోట్లు, వెస్ట్ రూ.5 కోట్లు, కృష్ణ రూ.5.60, గుంటూరు రూ.7.20, నెల్లూరు రూ.2.80కోట్ల బిజినెస్‌ జరిగిందని సినీ వర్గాల సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ రూ.73కోట్ల బిజినెస్ చేసుకుంది.

ALSO READ | Game Changer: గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు.. తెలుగు రాష్ట్రాల్లో టార్గెట్ ఎంత..?

బాలకృష్ణ చివరి చిత్రం 'భగవంత్‌ కేసరి' తెలుగు రాష్ట్రాల్లో రూ.65కోట్లకు అమ్ముడుపోయింది. ఇపుడు డాకు మహారాజ్ ఈ లెక్కను మించి రూ.73కోట్లకు బిజినెస్ చేసుకుంది. ఇది బాలకృష్ణ కెరీర్లో హయ్యెస్ట్ బిజినెస్ చేసుకున్న చిత్రంగా నిలిచింది.

ఈ మూవీ దాదాపు రూ.80 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కింది. అన్ని కలుపుకుని ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే సుమారు రూ.190కోట్ల గ్రాస్‌ సాధించాలని ట్రేడ్ నిపుణుల లెక్కల చెబుతున్నాయి. చూడాలి మరి డాకు మహారాజ్ ఎలాంటి లెక్కలు తిరగరాస్తుందో! ఇకపోతే డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (జనవరి 8న) విజయవాడ లేదా మంగళగిరిలో ఉండొచ్చని నిర్మాత నాగవంశీ తెలిపారు.