Aditya 369 Sequel Update: జై బాలయ్య.. ఆదిత్య 369 సీక్వెల్ స్టోరీ, హీరో రెడీ.. కొత్త గెటప్ లో

Aditya 369 Sequel Update:  జై బాలయ్య.. ఆదిత్య 369 సీక్వెల్ స్టోరీ, హీరో రెడీ.. కొత్త గెటప్ లో

Aditya 369 Sequel Update: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ ని తన నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. దీంతో మోక్షజ్ఞ నటించే సినిమాల కథల విషయంలో చాలా బాలకృష్ణ జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. దీంతో రూ.100 కోట్లు పైగా బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

బాలకృష్ణ 1991లో హీరోగా నటించిన ఆదిత్య 369 సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ చెయ్యాలని  బాలకృష్ణ అనుకుంటున్నప్పటికీ కుదరలేదు. అయితే ఇటీవలే ఆదిత్య 369 సీక్వెల్ కి స్టోరీ సిద్దమైనట్లు తెలుస్తోంది.అలాగే ఈ సీక్వెల్ కి ఆదిత్య 999 అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో సీనియర్ సైంటిస్ట్ గెటప్ లో కనిపించిన ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఎపిసోడ్ కి మోక్షజ్ఞ కూడా గెస్ట్ గా వచ్చి సందడి చేయనున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఆదిత్య 999 కి సంబందించిన కీలక విషయాలు చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎపిసోడ్ డిసెంబర్ 06 నుంచి ప్రముఖ ఓటిటి ఆహాలో ప్రసారం కానుంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Also Read:-సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్లో అలియా భట్..

ఇక ఆదిత్య 369 సినిమా విషయానికొస్తే ఈ సినిమాకి ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించాడు. సీనియర్ హీరోయిన్ హేమ హీరోయిన్ గా నటించగా అమ్రీష్ పూరి, సిల్క్ స్మిత, టిన్ను ఆనంద్, శుభలేఖ సుధాకర్, తరుణ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అప్పట్లోనే టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్ గా అలోచించి ఈ సినిమాని తెరకెక్కించారు. 

ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ యాక్షన్ తో అలరించాడు. దీంతో మోక్షజ్ఞ ఆదిత్య 999 సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో మోక్షజ్ఞకి జోడీగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకనిర్మాతలు, క్యాస్ట్ & కక్రూ వివరాలు తెలియాల్సి ఉంది.