ప్రముఖ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో సక్సెస్ఫుల్ గా 3 సీజన్లు పూర్తీ చేసుకుంది. ఈ క్రమంలో సినీ సెలబ్రెటీలను ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడుగుతూ బాలకృష్ణ చేసే సందడికి ఫ్యాన్స్ ఫిధా అయ్యారు. దీంతో అన్ స్టాపబుల్ సీజన్ 4 గురించి ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే దసరా పండుగ సందర్భంగా అన్ స్టాపబుల్ సీజన్ 4 అప్డేట్ ఇచ్చారు షో నిర్వాహకులు. ఇందులో భాగంగా 4 నిమిషాల గల యానిమేషన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ లో బాలకృష్ణ సూపర్ హీరోగా కనిపించాడు.
ఆయన కన్నెర్రజేస్తే ప్రళయం, మీసం తిప్పితే శత్రువుకి మరణం, ఆయన మాట శాసనం అంటూ ఎలివేషన్స్ ఇస్తూ యానిమేషన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. జనరేషన్ మారినా మన మధ్య ఎమోషన్ మారదని నిరూపించారని, అలాగే మన దెబ్బకి థింకింగ్ మారాలంటూ బాలకృష్ణ చెప్పే ఎమోషనల్ డైలాగులు మొత్తం ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి.
ALSO READ : బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: ఆ క్రేజీ డైరెక్టర్ తో నాలుగోసారి
అన్ స్టాపబుల్ సీజన్ 4లో ప్రశ్నలు ఇంకొంచెం ఘాటుగా ఉంటాయని, ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు అన్ స్టాపబుల్ సీజన్ 4 రెడీ గా ఉందని బాలకృష్ణ తెలిపారు. అలాగే అక్టోబర్ 24 అన్ స్టాపబుల్ సీజన్ 4 ని గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఈ విషయం ఇలా ఉండగా అన్ స్టాపబుల్ షో ప్రపంచంలోనే అత్యధికంగా గుర్తింపు పొందిన షోలలో 18వ స్థానంలో నిలిచింది. ఇక మన దేశంలో అయితే టాప్ వరుసలో కొనసాగుతోంది. ఇక మొదటి ఎపిసోడ్ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు పుష్ప చిత్ర యూనిట్ తో కలసి తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన పూర్తీ వివరాలు అవకాశాలు ఉన్నాయి.