బాలకృష్ణ సినిమాకి స్టోరీతో పాటు టైటిల్ కూడా పవర్‌ఫుల్ గా ఉండాలని ఆశిస్తారు ఆయన ఫ్యాన్స్. అందుకే దర్శక నిర్మాతలు కూడా క్యాచీ టైటిల్స్ పెడుతుంటారు. బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో రానున్న సినిమాకి కూడా అలాంటి పేరు పెడతారనే అంచనాతో ఉన్నారు అభిమానులు. గతంలో తామిద్దరం కలిసి చేసిన సినిమాలకి సింహా, లెజెండ్ అంటూ పవర్‌ఫుల్ టైటిల్స్ ఫిక్స్ చేసిన బోయపాటి.. ఈసారి కూడా అలాంటి టైటిల్ కోసమే ఆలోచిస్తున్నాడట. ఆల్రెడీ అఘోరా, మోనార్క్, సూపర్‌మేన్, డేంజర్, మొనగాడు వంటి టైటిల్స్ వినిపించాయి. ఇప్పుడు ‘బొనాంజా’ అనే టైటిల్ ని ఫైనల్ చేశారంటూ ప్రచారం మొదలైంది. కేవలం సినిమా పేరు గురించే కాదు, హీరోయిన్ విషయంలోనూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య డ్యూయెల్ రోల్ చేస్తున్నారు కనుక ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, వారిలో ఒకరు కొత్త హీరోయిన్ అని, మరో హీరోయిన్‌గా అమలాపాల్ ను తీసుకున్నారనే టాక్ కూడా ఉంది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నఈ మూవీ తొలి షెడ్యూల్ పూర్తయ్యాక లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది.