![Veera simhareddy: ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన బాలయ్య](https://static.v6velugu.com/uploads/2023/01/Balakrishna-veerasimhareddy-saw-in-Bhramaramba-Theater-in-KukatPally_b8R9L1m6SH.jpg)
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు సందడి చేస్తున్నారు. ఉదయం నుంచే థియేటర్ల వద్ద అభిమానులు హంగామా చేస్తున్నారు.
ఇవాళ ఉదయం కూకట్ పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో బాలయ్య సందడి చేశారు. మూవీ టీంతో కలిసి బెనిఫిట్ షో చూసేందుకు బాలయ్య థియేటర్ కు వచ్చారు. బాలయ్యకు అభిమానులు బ్యాండ్ బాజాలతో ఘనస్వాగతం పలికారు. జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానులతో సినిమా చూడటం ఆనందంగా బాలయ్య ఉందన్నారు.
గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ నటించింది.తమన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.