ప్రిన్సిపల్ మేడంని సస్పెండ్ చేయాలని.. విద్యార్థినిలు సూర్యాపేట కలక్టరేట్ ముట్టడి

సూర్యాపేట కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు బాలెం ఎస్సీ బాలికల డిగ్రీ కాలేజీ విద్యార్థినిలు. ప్రిన్సిపల్ ఆఫీసులో మద్యం సీసాలు దొరికిన ఘటనలో ప్రిన్సిపల్ శైలజపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. దాదాపు 200 మంది విద్యార్థినిలు బాలెం నుంచి సూర్యాపేట కలెక్టరేట్ వరకు 15 కిలో మీటర్లు పాదయాత్రగా వచ్చి ఆందోళన చేశారు. వెంటనే ప్రిన్సిపల్ శైలజను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 

ALSO READ | అప్పుల్లో కూరుకుపోయిన నల్గొండ మున్సిపాలిటీ !

బాలెంల కళాశాలను విద్యార్థినీలతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. కలెక్టర్ తో పాటు డిప్యూటీ సి.ఈ. ఓ శిరీష, ఆర్.సి.ఓ అరుణ కుమారి,  సాంఘిక సంక్షేమ అధికారి లత, dwo వెంకటరమణ హాస్టల్ ను సందర్శించారు. కళాశాలలో జరిగిన సంఘటనపై డిగ్రీ విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడి తెలుసుకున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అలాగే స్టడీ అవర్స్ పై వివరాలు ఆరా తీశారు.

ALSO READ | విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి : కలెక్టర్ తేజస్ నందలాల్