వడివేలు గ్యాంగ్ అరెస్ట్.. టెక్నాలజీ దొంగలు

సిటీలో దొంగతనాలు ఎక్కువయ్యాయి.  ఏ మాత్రం ఛాన్స్ దొరికిన  దొంగలు రెచ్చిపోతున్నారు.  నగరంలో ల్యాప్టాప్ లను దొంగతనం చేస్తోన్న తమిళనాడుకు చెందిన వడివేలు గ్యాంగ్ ను బాలనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.  వారిదగ్గరి నుంచి మూడు ల్యాప్టాప్లు, రెండు సెల్ ఫోన్ లతో పాటు ఐదు లక్షల రూపాయలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

అరెస్ట్ అయిన వాళ్లలో వడివేలు, మరియప్పన్, సత్తివేలు, సత్యరాజ్ గా గుర్తించారు.   ఈ నలుగురు తమిళనాడు లోని వెల్లూర్ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా పోలీసులు గుర్తించారు.  2019 నుంచి 2023 వరకు సైబరాబాద్ లో వీళ్లపై 105 కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.  

అయితే వీళ్లపై తమిళనాడులో కూడా కేసులున్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.  - చెవిటి, మూగ, గుడ్డి వాళ్ళలా నటిస్తూ రెక్కీ చేస్తుంటారని పోలీసులు తెలిపారు.  ఎవరికైనా అనుమానం వచ్చి అడిగితే... వాళ్ళు ముందే ప్రింట్ చేయించుకున్న పాంప్లెనట్స్ చూపించేవాళ్ళని వెల్లడించారు.