జీడిమెట్ల, వెలుగు : పోలీసులకు చిక్కకుండా వేల కిలోమీటర్లు బైక్‌పైనే వెళ్లి, ఒడిశా నుంచి హైదరాబాద్‌కు హాష్‌ఆయిల్ సరఫరా చేస్తున్న ముగ్గురిని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.13 లక్షల విలువైన 2.59 లీటర్ల హాష్‌ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. నల్లొండ జిల్లా దేవరకొండ మండలం చందంపేట్కు చెందిన సపావత్ సుమన్(25) ఈజీమనీ కోసం గంజాయి దందాలోకి దిగాడు. 2021లో జైలుకు వెళ్లినా తీరు మార్చుకోలేదు. తన పక్క గ్రామం నీరెడుగుమ్కు చెందిన కేతావత్విజయకుమార్ (32)ను గంజాయి, హాష్ఆయిల్కొనుగోలు చేసే కస్టమర్స్ కావాలని అడిగాడు.
అతడు కస్టమర్స్ ఉన్నారని చెప్పడంతో.. సుమన్ తన పాత స్నేహితుడు ఒడిశాకు చెందిన కిరణ్‌కు కాల్ చేసి సరుకు రెడీ చేయమని చెప్పాడు. అక్టోబర్ 27న మరో వ్యక్తి రమావత్ లల్లూను తీసుకొని పల్సర్ బైక్‌పై పాడేరుకు వెళ్లాడు. అక్కడికి వచ్చిన కిరణ్ నుంచి 2.59 లీటర్ల హాష్‌ఆయిల్ డెలివరీ తీసుకొని, సిటీకి బయలుదేరారు. అక్టోబర్31న వీరిద్దరూ బాలానగర్‌లోని శోభనా థియేటర్ వద్ద కస్టమర్స్ కోసం చూస్తుండగా
బాలానగర్ఎస్ వోటీ, పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.59 లీటర్ల హాష్‌ఆయిల్, పల్సర్ బైక్, 3 మొబైల్ ఫోన్స్స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సహాయంతో విజయ్‌కుమార్‌ను కూడా అరెస్ట్ చేయగా, కిరణ్పరారీలో ఉన్నట్లు డీసీసీ సురేశ్ కుమార్ తెలిపారు.
ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్
చందానగర్ : చందానగర్ పరిధి గుల్మోహర్ పార్కు కాలనీలోని ఇంటి నెంబర్56లో ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్ నిల్వ ఉన్నట్లు సమాచారం రావడంతో.. పోలీసులు దాడి చేశారు. 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకొని, నిందితుడు కృష్ణారామ్ను అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి సిటీలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బండ్లగూడలో మహిళ అరెస్ట్
గండిపేట, వెలుగు : హాష్ ఆయిల్ అమ్ముతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ సన్‌సీటీలో ఉంటున్న రహీమ్ ఉన్నీసా(48) కొన్ని రోజులుగా హాష్ఆయిల్ను విక్రయిస్తుంది. పక్కా సమాచారంతో పోలీసులు ఆమె ఇంట్లో దాడులు నిర్వహించి, 231 గ్రాముల హాష్ ఆయిల్, 3.55 లక్షల నగదు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.