కూకట్పల్లి, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం బాలానగర్, అల్లాపూర్ డివిజన్లలో పర్యటించారు. చాలా కాలంగా పెండింగ్ పడిన సమస్యలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. బాలానగర్ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ పక్కగా వెళ్తున్న నాలాకు రిటైనింగ్వాల్నిర్మించాలని స్థానికులు కోరారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా ఇండస్ట్రియల్వేస్ట్ను తెచ్చి నాలాలో పోస్తున్నారని, వేస్ట్పారబోతకు అడ్డుకట్ట వేయాలని విజ్ఙప్తి చేశారు. అనంతరం ఆమె అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్‌నగర్, సఫ్దర్‌నగర్, రాజీవ్‌గాంధీనగర్‌లో పర్యటించారు.
బస్తీల మధ్యగా వెళ్తున్న నాలాకు రిటైనింగ్ వాల్ లేకపోవటంతో చిన్నపాటి వర్షానికే తమ ఇండ్లు మునుగుతున్నాయని స్థానికులు వాపోయారు. ముంపు నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మేయర్విజయలక్ష్మి వారికి హామీ ఇచ్చారు. ఆమె వెంట జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్‌కమిషనర్ అపూర్వచౌహాన్, కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ఇన్చార్జ్బండి రమేశ్ఉన్నారు.