ట్రాఫిక్​ కానిస్టేబుల్ గోపాల్​ తాగలేదు..బాలానగర్ ప్రమాదంపై  విచారణ చేస్తున్నం: డీసీపీ  

ట్రాఫిక్​ కానిస్టేబుల్ గోపాల్​ తాగలేదు..బాలానగర్ ప్రమాదంపై  విచారణ చేస్తున్నం: డీసీపీ  

జీడిమెట్ల, వెలుగు: బాలానగర్​లో ఆదివారం రోడ్డు ప్రమాదం  జరగగా, ట్రాఫిక్ కానిస్టేబుల్ గోపాల్​​పై వచ్చిన ఆరోపణలపై డీసీపీ సురేశ్​కుమార్​ వివరణ ఇచ్చారు. సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ట్రాఫిక్ ​పోలీసులు చలాన్లు విధిస్తున్న సమయంలో అటుగా వచ్చిన బైక్​ రైడర్ జోషిబాబు(35)ను ట్రాఫిక్​ కానిస్టేబుల్ గోపాల్​ ఆపాడన్నారు. దీంతో చలానా పడుతుందనే భయంతో అతడు తప్పించుకునే ప్రయత్నం చేయగా, బస్సు ఢీ కొని మృతి చెందాడన్నారు.

గోపాల్​కు బ్రీత్​ఎనలైజర్​ టెస్టుతోపాటు బడ్ల్​ టెస్ట్​ సైతం చేయగా, అతని బ్లడ్​లో ఆల్కహాల్ లేదని తేలిందన్నారు. బైక్ రైడర్​పై కూడా చేయలేదన్నారు.  ఆ వీడియో ఫుటేజీలను బాధిత కుటుంబ సభ్యులకు చూపించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని,  విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.