Balapur Laddu Auction Live Updates: రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. ఎంతంటే..

Balapur Laddu Auction Live Updates: రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ.. ఎంతంటే..

బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలం ముగిసింది. 2024లో.. ఈసారి లడ్డూ ప్రసాదం 30  లక్షల వెయ్యి  రూపాయలకు.. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. గత ఏడాది కంటే.. ఈసారి 3 లక్షల రూపాయలు అదనంగా వేలంలో లడ్డూ ధర పలికింది. బాలాపూర్ లడ్డూ వేలంలో ఇదే రికార్డ్. బాలాపూర్ లడ్డూ ప్రసాదం వేలం హోరాహోరీగా సాగింది. లక్ష్మీనారాయణ, ప్రణీత్ రెడ్డి, కొలన్ శంకర్ రెడ్డి, దశరథగౌడ్.. ఈ నలుగురు వ్యక్తులు బాలాపూర్ గణేశ్ లడ్డూ దక్కించుకోవడం కోసం గట్టిగా పోటీ పడ్డారు. లడ్డూ ప్రసాదం దక్కించుకునేందుకు చివరి వరకు పోటీ పడ్డారు. చివరకు 30 లక్షల వెయ్యి రూపాయలకు కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు.

>>> రూ.30 లక్షల ఒక వెయ్యికి దక్కించుకున్న కొలను శంకర్ రెడ్డి

>>> రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశ్ లడ్డూ

>>> రూ.1116తో ప్రారంభమైన బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం పాట

>>> బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభం

>>> నేటికి 30 ఏళ్లు పూర్తిచేసుకున్న బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం

>>> లడ్డూ వేలం పాటలో ఈసారి కొత్త నిబంధన
>>> పోటీదారులు ముందుగా డబ్బు డిపాజిట్‌ చేయాలని షరతు
>>> ఈ ఏడాది లడ్డూ రూ.30 లక్షలు పలుకుతుందని అంచనా
>>> ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొననున్న 23 మంది

>>> లడ్డూ వేలం చూసేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు

>>> బాలాపూర్లో పుట్టిన వాళ్ళంతా అదృష్టవంతులు

>>> ప్రపంచమంతా బాలాపూర్ లడ్డూ వేలం పాట వైపు చూస్తుంది
>>> శోభాయాత్రకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా: సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే
>>> పార్టీలు పక్కన పెట్టి బాలాపూర్లో వినాయక పండగ చేసుకుంటున్నారు
>>>  2014 లో లడ్డూ తీసుకొని ఎమ్మెల్యే అయ్యాను: తీగల కృష్ణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
>>> బాలాపూర్ అంటేనే లడ్డు ఫేమస్
>>> ప్రపంచ దేశాలు బాలాపూర్ లడ్డూ వేలాన్ని చూస్తున్నాయి

>>> రూ.27 లక్షలతో దక్కించుకున్న లడ్డూ ప్రసాదాన్ని 3 వేల మందికి పంచిపెట్టాను : దాసరి దయానందరెడ్డి
>>> బాలాపూర్ గడ్డపైనే ఏదో మహిమ ఉంది.. గణేష్ లడ్డూ దక్కించుకున్న తర్వాత అంతా మంచే జరిగింది : దాసరి దయానందరెడ్డి
>>> 450 రూపాయల లడ్డూ ప్రసాదం.. 27 లక్షల రూపాయల వరకు చేరటం చూస్తుంటేనే.. బాలాపూర్ గణేష్ మహిమ అర్థం అవుతుంది : దాసరి దయానందరెడ్డి
>>> గత ఏడాది(2023) బాలాపూర్ లడ్డూ ప్రసాదం దక్కించుకున్న దాసరి దయానందరెడ్డికి సన్మానం ( రూ.27 లక్షలు). బాలాపూర్ ఉత్సవ కమిటీ తరపున బంగారం గొలుసు బహూకరణ

హుస్సేన్​సాగర్​కు సుమారు 21 కిలో మీటర్ల దూరం నుంచి తరలివచ్చే బాలాపూర్​ శోభాయాత్రే అతి పెద్దది. ఇక్కడ జరిగే లడ్డూ వేలం పాటను రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తుంది. వేలం తర్వాత మొదలయ్యే శోభాయాత్ర బాలాపూర్, కేశవగిరి, చాంద్రాయణ గుట్ట మీదుగా చార్మినార్‌‌‌‌, అఫ్జల్‌‌గంజ్, ఎంజే మార్కెట్‌‌, అబిడ్స్, బషీర్‌‌‌‌బాగ్‌‌, లిబర్టీ వై జంక్షన్‌‌ మీదుగా హుస్సేన్‌‌ సాగర్‌‌‌‌కు రాత్రి వరకు చేరుకోనుంది. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రధాన శోభాయాత్ర మార్గంలో 733 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

>>> రూ.450లతో ప్రారంభమైన బాలాపూర్ గణనాథుని లడ్డూ వేలం పాట.

>>> బాలాపూర్ లో గణేష్ శోభాయాత్ర.. గల్లీగల్లీలో హోరెత్తుతున్న జై భోలో గణేష్ మహారాజ్ కీ జై నినాదాలు

>>> గత ఏడాది (2023) 27 లక్షల రూపాయలు పలికిన బాలాపూర్ లడ్డూ ప్రసాదం