![సింగరేణి సీఎండీగా బలరాం నాయక్ నియామకం](https://static.v6velugu.com/uploads/2024/01/balaram-nayak-appointed-as-singareni-cmd_JhSsQYTWxi.jpg)
హైదరాబాద్: సింగరేణి సంస్థ ఛైర్మన్ గా ఎన్ బాలరామ్ నాయక్ నియామకమయ్యారు. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ పదవి కాలం ముగియడంతో జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆయన స్థానంలో బలరాం నాయక్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఆయన సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ గా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో బలరాం నాయక్ సింగరేణి ఫైనాన్స్ అండ్ వెల్ఫేర్ బాధ్యతలతో పాటు సీఎండీగా అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు.