
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో మహబూబాబాద్ కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ సోమవారం భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం బలరాంనాయక్ మాట్లాడుతూ.. గతంలో కేంద్ర మంత్రిగా భద్రాచలం ఏజెన్సీలో అనేక రకాల డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టినట్లు తెలిపారు. వాజేడు, భద్రాచలం వద్ద బ్రిడ్జిల నిర్మాణాల కోసం నిధులు తెచ్చానని తెలిపారు. నవోదయ, ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేయించానని వివరించారు. తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి పాలనతో 14 ఎంపీ స్థానాలను గెలుచుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు.